ప్రెస్ నోట్ - ది. 06-05-2022, నందిగామ
రైతాంగ సమస్య లపై పోరాడాలి... రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై .కేశవరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం నందిగామ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో ఎపి రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా 45 వ మహాసభలు ప్రారంభమైనాయి. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వల్ల దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. దేశంలో రైతు సంఘాలు ఏడాది పాటు జరిపిన సుదీర్ఘ పోరాటాలు వల్ల రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసుకోవటం జరిగిందని తెలిపారు. బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాయటం వల్ల రైతులు, కార్మికులు దోపిడీ కి గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వల్ల ,పెద్ద నోట్లు రద్దు వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. స్వామి నాధన్ కమిటీ సిఫారస్సులు అమలు చేయటం లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రైతు విమోచన చట్టం తీసుకురావటం వల్ల అక్కడ రైతు ఆత్మహత్యలు ఆగాయని వివరించారు. రైతులు ఆర్ధికంగా ఎదగటానికి ప్రభుత్వాలు సమగ్ర పంట ల గిట్టుబాటు మద్దతు ధరలు చట్టం, రైతు విమోచన చట్టం, సమగ్ర పంటల భీమా పధకం చట్టం తీసుకురావాలని కోరారు. ఉద్యమాలు ద్వారా నే రైతులు పంటలకు కనీస గిట్టుబాటు ధరలు సాదించుకోవాలని కోరారు. గ్రామాల్లో రైతులు సమిష్టి గా రైతు ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. మహిళలు పెద్ద సంఖ్యలో రైతు ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. జిల్లా లో పత్తి, మిర్చి, మామిడి, మల్లెపూలు,చెరుకు పంటలకు కనీస గిట్టుబాటు ధరల కోసం , రైతాంగ సాగునీటి సమస్యల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు. 28,29,30 తేదీలలో అనంతపురం లో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలు, డిసెంబర్ 28న కేరళలో జరుగు ఆల్ ఇండియా రైతు సంఘం మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ,మండల కేంధ్రాలలో, గ్రామాల్లో ఆర్బీకె కేంధ్రాలలో రైతులు ఉద్యమించాలని కోరారు. సుబాబులు పంటలకు కనీస గిట్టుబాటు ధర 5 వేలు ఇస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హమీ తక్షణమే అమలు చేయాలని కోరారు. జిల్లా లో నకిలీ మిర్చి విత్తనాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం రైతులు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జమలయ్య, రైతు జిల్లా అధ్యక్షవర్గ సభ్యులు నాగేశ్వర రెడ్డి, ఎం.చంద్రశేఖర్, సీనియర్ నాయకులు ఆళ్ల వెంకట రమణ, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, సీఐటీయూ నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్, నాయకులు సయ్యద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.